భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్య మంత్రి నబ కిశోర్ దాస్‌పై ఏఎస్‌ఐ కాల్పులు జరిపాడు. ఝార్‌సుగుద జిల్లా బ్రజ్‍రాజ్‌నగర్‌లోని గాంధీ స్క్వేర్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కారులో నుంచి దిగగానే పోలీసు తుపాకీ తీసి నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో కిశోర్ దాస్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అధికారులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్‌ఐ పేరు గోపాల్ దాస్ అని ఉన్నతాధికారులు వెల్లడించారు. అతను యూనిఫాంలోనే ఉన్నాడని పేర్కొన్నారు. తన సొంత తుపాకీతోనే కాల్పులు జరిపినట్లు చెప్పారు.
అయితే మంత్రిపై ఏఎస్‌ఐ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మంత్రికి పోలీస్ ఎస్కార్ట్ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం చూస్తుంటే భద్రతా వైఫల్యంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
చదవండి: కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించాం.. 'మన్‌కీ బాత్'లో మోదీ
Comments
Please login to add a commentAdd a comment