
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అడ్డుతగులుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టినా కేసు రికార్డులు అందజేసేందుకు సిట్ నిరాకరిస్తోంది.
ఎన్‌ఐఏకు అప్పగించిన ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను అప్పగించేందుకు ఏపీ సిట్ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈమేరకు ఎన్‌ఐఏ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ తీరుపై మండిపడ్డ ఎన్‌ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో.. కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.