ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు పేలుడు? లేఖ లభ్యం | Blast Near Israel Embassy 2 Suspects Caught On CCTV | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు పేలుడు? లేఖ లభ్యం

Published Wed, Dec 27 2023 1:46 PM | Last Updated on Wed, Dec 27 2023 1:48 PM

Blast Near Israel Embassy 2 Suspects Caught On CCTV - Sakshi

ఢ్లిలీ: ఢ్లిలీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు బెదిరింపుల ఘటనలో ఢిల్లీ పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు. దీంతోపాటు గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను విమర్శిస్తూ ఓ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. లేఖను ఇజ్రాయెల్ జెండాలో చుట్టారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చర్యను ఎండగడుతూ ఢిల్లీలో ఆదేశ దౌత్యవేత్తకు దుండగులు లేఖ రాశారని వెల్లడించారు. 

ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఎంబసీపై బాంబు పేలుళ్లు జరుపుతామని బెదిరింపు కాల్ప్ వచ్చాయి.  పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కానీ ఆ శబ్దం పేలుళ్లకు సంబంధించిందేనని ఇజ్రాయెల్ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీపై దాడిగానే పరిగణించింది. ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది.  

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు సహా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎస్‌జీ) విస్తృతంగా గాలింపు చేపట్టగా ఓ లేఖ లభ్యమైంది. గాజాపై ఇజ్రాయెల్ చర్యను విమర్శిస్తూ అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనపై నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. ఎంబసీ ప్రాంతంలో శబ్దం రసాయన పేలుడు అయి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్‌ఐఏ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. సమగ్రంగా దర్యాప్తు చేపడుతోంది.  

ఇదీ చదవండి: అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి అస్వస్థత
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement