సాక్షి, అమరావతి: కుల నిర్మూలన పోరాట సమితి నేత దుడ్డు ప్రభాకర్‌తో పాటు దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్(ఆర్కే) భార్య కందుల శిరీష అలియాస్ పద్మక్కను కూడా అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
2019లో ఛత్తీస్‌గఢ్‌లోని ట్రియ గ్రామంలో భద్రతా దళాలపై మావోయిస్టులు జరిపిన దాడి కేసులో వారిద్దరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించింది. దీనిని ఆర్కే డైరీ కేసుగా ఎన్‌ఐఏ పరిగణిస్తోంది. శిరీష, దుడ్డు ప్రభాకర్‌తో పాటు ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. శిరీషను ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని ఆమె నివాసంలో, ప్రభాకర్‌ను విజయవాడలో ఆయన నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
మావోయిస్టుల నుంచి నిధులు పొందుతూ.. ఆ పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు వీరిద్దరూ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని ఎన్‌ఐఏ తెలిపింది. మావోయిస్టు పార్టీ అనుబంధ విభాగాల పటిష్టత కోసం పనిచేస్తున్నారని పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు
Comments
Please login to add a commentAdd a comment