న్యూఢిల్లీ: ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా షాకిచ్చారు.
ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతిస్తున్న‘సిఖ్స్ ఫర్ జస్టిస్’అనే సంస్థ నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ నిధులు స్వీకరించారనే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణకు గవర్నర్ సోమవారం(మే6) సిఫారసు చేశారు.
ఆమ్‌ఆద్మీపార్టీకి సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి ఆప్‌కు 16 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయన్న ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఐఏ విచారణకు ఆదేశించినట్లు గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వరల్డ్ హిందూ ఫెడరేషన్ అశూ మోంగియా ఇచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment