దర్భంగా బ్లాస్ట్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ | Custody Of Accused Ended In Darbhanga Blast Case | Sakshi
Sakshi News home page

దర్భంగా బ్లాస్ట్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

Published Sun, Jul 18 2021 11:15 AM | Last Updated on Sun, Jul 18 2021 12:05 PM

Custody Of Accused Ended In Darbhanga Blast Case - Sakshi

దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులకు ఈనెల 23వరకు రిమాండ్ విధించారు. విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. పేలుడు వెనుక లష్కరే తొయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఉన్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది.

సాక్షి, హైదరాబాద్‌: దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులకు ఈనెల 23వరకు రిమాండ్ విధించారు. విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. పేలుడు వెనుక లష్కరే తొయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఉన్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌తో పాటు అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమేన్ ఆదేశాలతో భారత్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు నిర్థారించారు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలీం అనే మరో వ్యక్తి పాత్ర కూడా బయటపడింది.

పాకిస్తాన్ నుండి ఇక్బాల్ ఖానా ఆదేశాలు ఇచ్చేందుకు సోషల్ మీడియా ద్వారా వాయిస్ కాల్స్ చేసినట్లు నిర్థారణ అయ్యింది. హాజీ సలీమ్‌కి ఇంటర్నెట్ పై అవగాహన లేకపోవడంతో ఖలీం అనే వ్యక్తి సహాయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఖలీం సోషల్ మీడియా ఖాతా ద్వారా హాజీ సలీమ్ తో ఇక్బాల్ ఖానా వాయిస్ కాల్స్ మాట్లాడినట్లు విచారణలో తేలింది. ఒక్కో బ్లాస్ట్ కు కోటి రూపాయల నజరానా ఇస్తామని మాలిక్ సోదరులకు ఇక్బాల్ ఆశ చూపినట్లు విచారణలో వెల్లడైంది. 2012లో పాకిస్థాన్ ఆఫ్గన్ సరిహద్దులో ముఖ్య నేతలను కలిసినట్టు నజీర్ మాలిక్, హాజీ సలీం అంగీకరించారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement