హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ భార్య శిరీషను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ ప్రకటన విడుదల చేసింది. ఆమెతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది. వీరిద్దరికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ తెలిపింది. ఇప్పటికీ వారు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా మావోయిస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరుపుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది.
2019లో తిరియా ఎన్‌కౌంటర్‌లో ఆర్కే భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్‌లు పాల్గొన్నారని ఎన్‌ఐఏ తెలిపింది. వారోత్సవాల్లో భాగంగా వారు భారీ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించింది. ఆర్కే డైరీ ఆధారంగానే శిరీష, దుడ్డు ప్రభాకర్‌లను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ అలియాస్ ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మని కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకుంది.
మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్‌ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న ఆమెను సాయంత్రం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నం చింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నముచినా సమాధానం చెప్పలేదు.
గతంలోనూ తనిఖీ
ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా సైతం ఉద్యమ బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత 2022లో ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్‌ఐఏ బృందం ఓసారి తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యారి్థనితో దళాలకు వైద్యం చేయించి, దళం వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందన్న ఆరోపణలతో 2022 జూలై 19న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఎన్‌ఐఏ బృందం ఆమె ఇంట్లో తనిఖీ చేసింది.
ఇదీ చదవండి: ఎన్‌ఐఏ అదుపులో ఆర్కే భార్య శిరీష
Comments
Please login to add a commentAdd a comment