కొలంబో: శ్రీలంక ఈస్టర్ బాంబు పేలుళ్లలో భారత్ మూలాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు సభ్యులతో కూడిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బృందం కొలంబోకు చేరుకుంది. బాంబులకు పాల్పడిన వారు భారత్‌లోని కశ్మీర్, కేరళలో శిక్షణ పొందినట్లు తెలుస్తోందని శ్రీలంక పోలీస్ చీఫ్ ప్రకటించడం తెలిసిందే. దీనిపై లోతైన విచారణ కోసం ఎన్‌ఐఏ బృందం సంబంధిత అధికారులతో చర్చలు జరపనుంది. ఈ సమావేశంలో అనుమానిత ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని ఇరు దేశాలు పంచుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment