Girl sexual assault case
-
బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
విజయవాడస్పోర్ట్స్: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మహిళకు, నున్న గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె పిల్లలను తీసుకుని ఇబ్రహీంపట్నంలోని పుట్టింట్లో ఉండేది.కొన్నాళ్ల తరువాత భర్త వచ్చి తన ఐదేళ్ల పెద్ద కుమార్తెను నున్నలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాంబేకాలనీకి చెందిన 20 ఏళ్ల కుంచాల దుర్గారావు అలియాస్ తమ్మిశెట్టి దుర్గారావు అలియాస్ దుర్గా ఆ పాపను డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు పాపకు స్నానం చేయిస్తుండగా మర్మాంగాల వద్ద ఇన్ఫెక్షన్ రావడాన్ని గమనించిన తల్లి ఆరా తీయగా దుర్గారావు చేసిన అత్యాచారం బయటపడింది.వెంటనే పాపను చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పాపపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించడంతో పాప తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు 2019 ఏప్రిల్ ఆరో తేదీన నున్న పోలీసులు కేసు నమోదు చేసి 2020 ఆగస్టు 12వ తేదీన నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో నిందితుడు దుర్గారావుకు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
బాలికపై మానవమృగం ఐదు నెలలుగా లైంగిక దాడి
-
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్ట్
వరంగల్: బాలికపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు నల్లబెల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేట రూరల్ సీఐ బోనాల కిషన్, ఎస్సై కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని రాంతీర్థం శివారు బిల్నాయక్తండా గ్రామానికి చెందిన బాలిక (17) కొన్నేళ్ల నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు ఇంటి వెనక ఉన్న మాలోతు సమ్మయ్య, మాలోత్ దేవ్జీ ఇళ్లకు వెళ్తుండేది. ఈ సందర్భంగా సదరు వ్యక్తులు బాలికను లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడుతున్నారు. కాగా, బాలిక తాతయ్య ఇటీవల చెరువులో పడి మృతి చెందగా.. ఆయన ఆస్థికలను కాళేశ్వరంలోని గోదావరి నదిలో కలిపేందుకు కుటుంబ సభ్యులు ఈ నెల 20వ తేదీన వెళ్లారు. ఈ క్రమంలో సమ్మయ్య, దేవ్జీలు బాలికపై మరోమారు లైంగికదాడికి పాల్పడేందుకు పథకం రచించారు. బాలిక నీళ్ల కోసం వెళ్లగా రూ.100 ఇచ్చి గుడుంబా, కూల్డ్రింక్స్ తెప్పించుకుని రెండింటిని కలిపి ఆమెకు తాగించారు. అనంతరం ఇద్దరు కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పి బోరున విలపించింది. ఈ మేరకు ఆమె శుక్రవారం ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు నిర్భయ, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులు మాలోత్ సమ్మయ్య, మాలోత్ రావ్జీను అరెస్టు చేశారు. అలాగే బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తరలించారు.