నేపాల్‌లోని ఖాట్మాండులో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే 12వ అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్‌కు రాష్ట్రం నుంచి టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హాజరు కానున్నారు.
ఖాట్మాండులో ఈనెల 12 నుంచి 15 వరకు సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లోని ఖాట్మాండులో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే 12వ అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్‌కు రాష్ట్రం నుంచి టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హాజరు కానున్నారు. ప్రతి మూడేళ్లకోసారి జరిగే ఈ సమావేశాలకు హాజరు కావాలని ఆయనకు ఆహ్వానం అందింది. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్‌నుంచి ఏపీఎన్‌జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు హాజరుకానున్నారు.
మన దేశం నుంచి 10 మందికి ఆహ్వానం అందినట్లు టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్ వెల్లడించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ఉద్యోగ, కార్మిక విధానాలు, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు, సంక్షేమ పథకాలపై ఉద్యోగుల స్పందించేతీరు, పనివిధానం ఎలా ఉందన్న అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తారని తెలిపారు.