![Muthoottu Mini Financiers Plans To Launch 50 Branches In Telugu States - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/31/Untitled-2_0.jpg.webp?itok=MgfPG6uL)
హైదరాబాద్: ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ (యెల్లో ముత్తూట్) తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 50 శాఖలను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా తొలి దశలో ఒకే రోజున 10 శాఖలను సంస్థ సీఈవో పీఈ మథాయ్ ప్రారంభించారు. కొత్త బ్రాంచీలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ శాఖల సంఖ్య 250కి, దేశవ్యాప్తంగా 900 పైచిలుకు స్థాయి కి చేరుతుందని ఆయన తెలిపారు.
నూతన శాఖల్లో బంగారం రుణాలతో పాటు బీమా, మనీ ట్రాన్స్‌ఫర్, సూక్ష్మ రుణాలు, వెల్త్ మేనేజ్‌మెంట్ తదితర సర్వీసులు అందించను న్నట్లు వివరించారు. రెండో విడత కింద జనవరిలో మరికొన్ని శాఖలను ప్రారంభించనున్నట్లు మథాయ్ చెప్పారు. కంపెనీ వచ్చే రెండేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది.
చదవండి: ఇది కదా ఆఫర్ అంటే.. ఇలా చేస్తే, కేవలం రూ.1490లకే యాపిల్ ఎయిర్‌పొడ్స్!
Comments
Please login to add a commentAdd a comment