
హైదరాబాద్: బంధన్ బ్యాంకు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 125 నూతన శాఖలను ప్రారంభించినట్టు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా బంధన్ బ్యాంకు శాఖలు 1,013కు పెరిగాయి. అలాగే, 3,206 బ్యాంకింగ్ యూనిట్లు, 195 గృహ రుణ సేవా కేంద్రాలు కూడా బ్యాంకు నెట్‌వర్క్ పరిధిలో ఉన్నాయి. దీంతో మొత్తం మీద దేశవ్యాప్తంగా తమకు 4,414 బ్యాంకింగ్ ఔట్‌లెట్లు ఉన్నట్టు బంధన్ బ్యాంకు తెలిపింది. అలాగే, రెండు మినహా దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోకి విస్తరించినట్టు పేర్కొంది. డిసెంబర్ చివరికి బంధన్ బ్యాంకు రూ.54,908 కోట్ల డిపాజిట్లు, రూ.65,456 కోట్ల రుణ పుసక్తంతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment