అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సంబంధిత అధికారులకు సూచించారు. మెట్రో రైలును ప్రోత్సహించడంతోపాటు ప్రయాణికుల సాధక బాధకాలను ఆలకించేందుకు ఆయన సోమవారం ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు స్టేషన్ నుంచి శివాజీ పార్కు స్టేషన్ వరకూ ప్రయాణించారు. వీటి సేవలు ప్రజాదరణ పొందేలా చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా ప్రయాణ చార్జీల భారం తగ్గించేం దుకు కృషి చేస్తామన్నారు. మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తోం దంటూఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌పై ఆయన ప్రశంసల జల్లులు కురిపించారు. మెట్రో రైలు వ్యవస్థ బాగుందన్నారు.
‘నిజంగా సకాలంలో, అత్యంత సౌకర్యవంతంగా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునేవారికి ఇదొక చక్కని ప్రజారవాణా వ్యవస్థ అని నేను భావిస్తున్నా. ఢిల్లీ మెట్రోతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్న ఈ వ్యవస్థ నవీన భారతానికి సూచిక .మనం కనుక మంచి అవకాశాలు కల్పించగలిగితే వాటిని సద్వినియోగం చేసుకోగల సామర్థ్యం మన ప్రజలకు ఉంది. వారు అద్భుతాలు సృష్టించగలుగుతారు’ అని అన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య... పలువురు ప్రయాణికులతో ముచ్చటించి వారి సాధక బాధకాలను ఎంతో ఓపిగ్గా ఆలకించారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించారు. ప్రయా ణ చార్జీలు, ఆయా స్టేషన్లలో వెసులుబాట్లు, మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు తదితర అంశాలపై వారితో ఆయన మాట్లాడారు.
‘ప్రయాణికులతో మాట్లాడేందుకు నాకో సువర్ణావకాశం లభించింది. వారితో అనేక అంశాలపై మాట్లాడాను. చార్జీలు ఎక్కువగా ఉన్నాయని వారు నాతో చెప్పారు. ఈ అంశాన్ని పరిశీలించాలని, వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలని సంబంధిత అధికారులకు సూచించా. ఢిల్లీ మెట్రో- ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్( డీటీసీ)లను అనుసంధానం చేయడంద్వారా కనె క్టివిటీ పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని కూడా సూచించా. ఇందువల్ల ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. అయితే ఇదంతా జరిగేందుకు కొంత సమయం పడుతుంది. ఎల్లకాలం ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడడం మంచిది కాదు’ అని అన్నారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఏటీఎంలు, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయడంతో ప్రకటనలకు అవకాశం కల్పిస్తే డీఎం ఆర్‌సీ ఆదాయం పెరుగుతుందన్నారు.
ఢిల్లీ మెట్రో సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్టు వెంకయ్య నాయుడు చెప్పారు. జాతీయ రాజధాని నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లకు వెళ్లే ప్రయాణికులకు దీనిని అనువుగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందన్నారు. రాజధానికి ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రతిరోజూ రాకపోకలు సాగించేవారికి ఇది అనువుగా ఉండడమనేది అత్యం త ముఖ్యమన్నారు. రహదార్లపై రాకపోకలు సాగి స్తున్న వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోం దని, దీంతో నగరవాసులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మెట్రో రైలులో ప్రయాణం వల్ల తనకు 40 నిమిషాల సమయం ఆదా అయిందని తెలిపారు. రహదారులపై ప్రయాణంవల్ల సమయం వృథా అవడమే కాకుండా అలసట కలుగుతుందన్నారు. తన మాదిరిగానే తన సహచర మంత్రులు కూడా దీనిలో ప్రయాణించాలని ఆయన సూచించారు.