నేషనల్ హెరాల్డ్ కేసుపై పార్లమెంట్ ను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుపై పార్లమెంట్ ను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యసభను స్తంభింపజేస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ తీరుపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని మోదీ సర్కారు భావిస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం పంజాబ్, జమ్మూకశ్మీర్ ఎంపీలతో సమావేశమయ్యారు.
శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ మొండివైఖరిపై ప్రచారం నిర్వహించాలని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలను వెంకయ్య కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేనందున కీలక బిల్లులు పాసవకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని, ప్రధాన విపక్షం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్టు తెలిపాయి.