
'నరేంద్ర మోడీ '3డి' మంత్రం.. ప్రజలకు సమ్మోహితం'
వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వం మారాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వం మారాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ '3డి' మంత్రం ప్రజల్ని అమితంగా ఆకర్షిస్తోందని చెప్పారు. మోడీ.. నిర్ణయాత్మకత, దూసుకుపోయే స్వభావం, అభివృద్ధి లక్షణాలు ప్రజల్ని ఆలోచింపచేస్తున్నాయని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
యూపీఏ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాల ప్రజలూ ఇదే అభిప్రాయంతో ఉన్నరన్నారు. యూపీఏ కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతోందని, చురుగ్గా వ్యవహరించడం లేదని ఆరోపించారు.