
శ్రీ సాంస్కృతిక కళాసారథి ద్వితీయ వార్షిక విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా సింగపూర్ పర్యటనలో ఉన్న భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఘనంగా సత్కరించింది. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, సంతోష్ జులూరి, ఇతర కార్యవర్గ సభ్యులు శ్రీధర్ కొల్లూరి, శశిధర్ రెడ్డి, నడికట్ల భాస్కర్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి విజయోత్సవ సభలో సొసైటీ తరపున జ్ఞాపక అందజేసి శాలువాతో సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి ని భావితరాలకు అందజేయడం లో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి మరియు తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ లను అభినందించారు. వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో సింగపూర్ తెలుగు కళాకారుల సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్చరల్ సొసైటీని ప్రత్యేకంగా ఆహ్వానించిన కవుటూరు రత్న కుమార్‌కు ప్ర త్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.
Comments
Please login to add a commentAdd a comment