సీశాట్ పై అభిప్రాయాలు తెలపండి: కేంద్రం
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) ప్రవేశపెట్టిన సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీశాట్) పై అభిప్రాయాలు తెలపాలని అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. రెండు వారాల్లోగా అభిప్రాయాలు వెల్లడించాలని ఆదివారం విజ్ఞప్తి చేసింది.
సీశాట్ పై అన్ని కోణాల్లో సమీక్ష జరుపుతామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. పార్లమెంట్ లో ఆదివారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ విషయం చెప్పారు.
యూపీఎస్సీ ప్రవేశపెట్టిన సీశాట్ వల్ల ప్రాంతీయ భాషల్లో సివిల్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.