'మెజార్టీ లభించకపోయినా మోడీనే ప్రధాని అభ్యర్ధి'
న్యూఢిల్లీ: మెజార్టీ సీట్లు రాకుంటే ప్రధానమంత్రి అభ్యర్ధి మార్చమని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీకి మెజార్టీకి సీట్లు లభించకపోతే ప్రధానమంత్రి అభ్యర్ధిని మార్చవచ్చనే వార్తలను ఆపార్టీ నేత వెంకయ్యనాయుడు ఖండించారు.
మీడియాలో వస్తున్న కథనాలన్ని అవాస్తవాలని వెంకయ్య అన్నారు. ప్రధాని పదవికి నరేంద్రమోడీ అభ్యర్ధిత్వమే ఏకగ్రీవమని వెంకయ్య స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వంలో సీనియర్లకు చోటు లభించదనే వార్తల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు మురళీ మనోహర్ జోషి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. బీజేపీలో సీనియర్లకు కూడా చోటు ఉంటుందని వెంకయ్య తెలిపారు.