' మోడీ సారథ్యంలోనే భారత్ పురోగమిస్తుంది' | India developed only Narendra Modi rule, says M Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

' మోడీ సారథ్యంలోనే భారత్ పురోగమిస్తుంది'

Published Tue, Nov 19 2013 1:13 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

' మోడీ సారథ్యంలోనే భారత్ పురోగమిస్తుంది' - Sakshi

' మోడీ సారథ్యంలోనే భారత్ పురోగమిస్తుంది'

మోడీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ... ప్రస్తుత అధోగతిలో ఉన్న భారత్ను పురోగతి వైపు మళ్లించే సత్తా గుజరాత్ ముఖ్యమంత్రి, భారత ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకే ఉందని ఆయన స్ఫష్టం చేశారు.

 

నలుగురు రేప్ నిందితులకు క్షమాభిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు. అలాంటి పార్టీ నేడు తమ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని వెంకయ్య వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీకి ఓ విధానం అంటూ లేదని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement