
'రెండు హైకోర్టులు ఉంటే మంచిదే'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు లోక్ సభలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశం కోర్టులో ఉందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలను రెండు హైకోర్టులు ఉడడం మంచిదే అన్నారు.
మనసుంటే మార్గం ఉంటుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ లోక్ సభలో పేర్కొన్నారు. హైకోర్టులో కేసు పరిష్కారం అయిపోయిందని తెలిపాడు. రాష్ట్రపతి హైకోర్టును నోటిఫై చేయడానికి కేంద్ర కేబినెట్ ముందుగా నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.