andhra pradesh common High court
-
'రెండు హైకోర్టులు ఉంటే మంచిదే'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు లోక్ సభలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశం కోర్టులో ఉందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలను రెండు హైకోర్టులు ఉడడం మంచిదే అన్నారు. మనసుంటే మార్గం ఉంటుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ లోక్ సభలో పేర్కొన్నారు. హైకోర్టులో కేసు పరిష్కారం అయిపోయిందని తెలిపాడు. రాష్ట్రపతి హైకోర్టును నోటిఫై చేయడానికి కేంద్ర కేబినెట్ ముందుగా నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. -
'పీఎంను కలిసినా పట్టించుకోవడం లేదు'
న్యూఢిల్లీ: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ జితేంతర్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్ సభలో మంగళవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. కోర్టును విభజించాలని తమ ముఖ్యమంత్రి పలుమార్లు ప్రధానమంత్రిని కలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏపీ హైకోర్టుకు ప్రత్యేక బిల్డింగ్ కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినా విభజనకు కేంద్రం ముందుకు రావడం లేదని వాపోయారు. హైకోర్టు విభజన ఆలస్యమవుతుండడంతో తెలంగాణ న్యాయవాదులు నష్టపోతున్నారని పార్లమెంట్ దృష్టికి తెచ్చారు.