
'పీఎంను కలిసినా పట్టించుకోవడం లేదు'
న్యూఢిల్లీ: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ జితేంతర్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్ సభలో మంగళవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. కోర్టును విభజించాలని తమ ముఖ్యమంత్రి పలుమార్లు ప్రధానమంత్రిని కలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఏపీ హైకోర్టుకు ప్రత్యేక బిల్డింగ్ కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినా విభజనకు కేంద్రం ముందుకు రావడం లేదని వాపోయారు. హైకోర్టు విభజన ఆలస్యమవుతుండడంతో తెలంగాణ న్యాయవాదులు నష్టపోతున్నారని పార్లమెంట్ దృష్టికి తెచ్చారు.