అన్నదాతను కేంద్రం ఆదుకోవాలి | central governement sholud save formers: mp jitender reddy | Sakshi
Sakshi News home page

అన్నదాతను కేంద్రం ఆదుకోవాలి

Published Tue, Apr 21 2015 12:55 AM | Last Updated on Thu, Aug 9 2018 8:30 PM

central governement sholud save formers: mp jitender reddy

సాక్షి, న్యూఢిల్లీ: అకాల వర్షాలతో తెలంగాణలో పంట నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీఆర్‌ఎస్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ పరిస్థితులపై లోక్‌సభలో సోమవారం ఆయన ప్రసంగించారు. ఇటీవల కురిసిన అకాల వర్షం కారణంగా పలు రకాల పంటలు నీటిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే రాష్ట్రంలో పర్యటించాలని జితేందర్‌రెడ్డి కోరారు. ప్రధానమంత్రి ఇటీవల ప్రకటించిన విధానం ప్రకారం వెంటనే తెలంగాణ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ దూరదృష్టి కారణంగా కేవలం పది నెలల పాలనలోనే విద్యుత్ కోతల నుంచి రైతాంగాన్ని బయటపడేశారని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement