యూపీఏ నిర్ణయాలపై ఎన్డీఏ సమీక్ష: వెంకయ్య | NDA govt may review some decisions of UPA: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

యూపీఏ నిర్ణయాలపై ఎన్డీఏ సమీక్ష: వెంకయ్య

Published Wed, May 14 2014 7:01 PM | Last Updated on Sat, Aug 25 2018 4:39 PM

యూపీఏ నిర్ణయాలపై ఎన్డీఏ సమీక్ష: వెంకయ్య - Sakshi

యూపీఏ నిర్ణయాలపై ఎన్డీఏ సమీక్ష: వెంకయ్య

హైదరాబాద్: యూపీఏ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఎన్డీఏ ప్రభుత్వం సమీక్షిస్తుందని బీజేపీ  సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత  యూపీఏ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని అన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. వీటిని కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం సమీక్షిస్తుందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement