
'యూపీఏ కంటే మెరుగ్గా నడిపిస్తాం'
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సంతృప్తికరంగా జరిగాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. లోక్‌సభ 27 రోజులపాటు పనిచేసిందని తెలిపారు. యూపీఏ హయాం కంటే మెరుగ్గా సభాకార్యక్రమాలు నడిపిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పోలవరం, జడ్జీల నియామక బిల్లు వంటి కీలక అంశాలను పార్లమెంట్ లో చర్చించామని తెలిపారు. రాజ్యసభలో తమకు మెజార్టీ లేకపోయిన ఇన్సూరెన్స్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించామని అన్నారు.
అయితే తన వాగ్ధాటితో నెగ్గుకు వచ్చే వెంకయ్య నాయుడు ఓ సందర్భంలో కోపం తెచ్చుకున్నారు. అప్రంటైసెస్ సవరణ బిల్లును స్థాయీసంఘానికి పంపించాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో లోక్‌సభలో కాంగ్రెస్‌నేత మల్లిఖార్జున్ ఖర్గేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజింగ్ పదం పదేపదే ఉపయోగించడం మంచిది కాదంటూ ఖర్గేకు సూచించారు.