
అధికార పార్టీ సభ్యుల తీరుపై వెంకయ్య ఆగ్రహం
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజనపై అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు వ్యవహారిస్తున్న తీరుపై బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న ఎలాంటి చర్యలు
తీసుకోవడం లేదని ఆయన అధికార పక్షంపై విరుచుకుపడ్డారు.
అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఆందోళనలు చేయడమేంటని రాజ్యసభలో ప్రతిపక్షనేత అరుణ్జైట్లీ ఈ సందర్భంగా ప్రశ్నించారు. సభ్యుల ఆందోళన తీరును నిరసిస్తూ బీజేపీ సభ్యలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. తమ ప్రయోజనాలు కాపాడాలంటూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు రాజ్యసభలో నిరసనలు తెలిపారు.