పాలకుండలో విషంచుక్క వేయొద్దు: యెన్నం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో విభజన చిచ్చు రేగింది. జాతీయ స్థాయి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడుపై మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వెంకయ్య నాయుడు సీమాంధ్ర నాయకుడిగా మాట్లాడెతున్నారా లేదా జాతీయ నాయకుడిగా సంప్రదింపులు జరుపుతున్నారా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. షరతులులేని తెలంగాణకు మద్దతు ఇస్తామని చెప్పి వెనుకా ముందాడడం మంచిదికాదన్నారు.
తెలంగాణ కల ఫలిస్తున్న సమయంలో తమ నోటికాడి బుక్క లాగేయొద్దని విజ్ఞప్తి చేశారు. నిండు పాలకుండలో విషంచుక్క వేయొద్దని యెన్నం కోరారు. పొత్తుకోసం, ఓట్లకోసం తెలంగాణ అంశాన్ని పక్కన పెడితే ఎవరూ సహించరని హెచ్చరించారు. ఈనెల11న పార్లమెంట్‌లో బిల్లు పెడితే తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. టీడీపీతో అంటకాగటం మంచిది కాదని హితవు పలికారు.