telangana bill
-
తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
-
రేపే ఆఖరి రోజు
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి రేపే ఆఖరి రోజని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై లోక్‌సభలో చర్చ ప్రారంభం కాగానే రాజీనామా చేయాలని సిఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై లోక్‌సభలో రేపు చర్చ ప్రారంభమవుతుంది. సచివాలయంలోని సిఎం పేషీలో వ్యక్తిగత వస్తువులను సిబ్బంది తీసుకువెళ్లినట్లు సమాచారం. పేషీ అధికారులు కూడా సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. తన రాజీనామాకు సంబంధించి సిఎం ఒకరిద్దరు ఎంపీలకు సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. -
లోక్‌సభ ఎజెండాలో లేని విభజన బిల్లు
-
పాలకుండలో విషంచుక్క వేయొద్దు: యెన్నం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో విభజన చిచ్చు రేగింది. జాతీయ స్థాయి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడుపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వెంకయ్య నాయుడు సీమాంధ్ర నాయకుడిగా మాట్లాడెతున్నారా లేదా జాతీయ నాయకుడిగా సంప్రదింపులు జరుపుతున్నారా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. షరతులులేని తెలంగాణకు మద్దతు ఇస్తామని చెప్పి వెనుకా ముందాడడం మంచిదికాదన్నారు. తెలంగాణ కల ఫలిస్తున్న సమయంలో తమ నోటికాడి బుక్క లాగేయొద్దని విజ్ఞప్తి చేశారు. నిండు పాలకుండలో విషంచుక్క వేయొద్దని యెన్నం కోరారు. పొత్తుకోసం, ఓట్లకోసం తెలంగాణ అంశాన్ని పక్కన పెడితే ఎవరూ సహించరని హెచ్చరించారు. ఈనెల11న పార్లమెంట్లో బిల్లు పెడితే తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. టీడీపీతో అంటకాగటం మంచిది కాదని హితవు పలికారు. -
సీఎం ధర్నా చేసినా చర్యలుండవా?: బీజేపీ
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, ఈ అంశాన్ని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ దుయ్యబట్టింది. తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉంటే సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ నేతలపై బహిష్కరణ వేటు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించింది. ఈ మేరకు బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ కాంగ్రెస్‌పై శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ‘వారి(కాంగ్రెస్) ముఖ్యమంత్రే ధర్నాకు దిగారు. వారి సొంత ఎంపీలే సభలకు అడ్డుతగులుతున్నారు. వారి ఎంపీలే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతారు. అలాంటప్పుడు వారిని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరు?’ అని ప్రశ్నించారు. -
తెలంగాణపై పార్లమెంటులో రేపు ప్రధాని ప్రకటన
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంటు ఉభయ సభలలో రేపు ఒక ప్రకటన చేయనున్నారు. రేపు జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో కూడా తెలంగాణ అంశాన్ని చర్చిస్తారు. కేంద్ర మంత్రుల బృందం (జిఓఎం) ఈ రాత్రికి మళ్లీ సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు తుది రూపం ఇవ్వనుంది. ఈ నెల 12వ తేదీ లోపల తెలంగాణ బిల్లును ఉభయ సభలలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
నేటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 66 రోజుల పాటు సమ్మె చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. జిల్లాలో సుమారు 40 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది రోడ్డెక్కనున్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లో సోమవారం సమావేశమై మెరుపు సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె ద్వారా మరోసారి ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. ఉపాధ్యాయులు, ట్రాన్స్‌కో, ఆర్టీసీ ఉద్యోగులు మినహా అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిపాలన స్తంభించనుంది. సమైక్యవాదాన్ని వినిపించాలి పార్లమెంట్లో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు సమైక్యవాదాన్ని వినిపించాలని జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం సాయంత్రం కాకినాడ ఏపీ ఎన్జీవో హోంలో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిన మేరకు సమ్మెలోకి వెళ్లాలని తీర్మానించారు. ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకించాలని, లేనిపక్షంలో వారి ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. అవసరమైతే రాష్ట్ర సంఘం పిలుపుతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, జాతీయ రహదారుల దిగ్బంధం, విద్యుత్ నిలిపివేత, రైల్‌రోకో కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు 15న వెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్‌రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, నాయకులు అనిల్ జాన్సన్, నాగేశ్వరరావు, జియాఉద్దీన్, పసుపులేటి శ్రీనివాసరావు, సరెళ్ల చంద్రరావు, వై. శ్రీనివాస్, విజయకుమార్, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
కేబినెట్‌కు అదే 'టీ'
* బిల్లులో ఎలాంటి మార్పులు, సవరణలు చేయని జీవోఎం * ఆర్థిక ప్యాకేజీలపై మాత్రం కేబినెట్‌కు ప్రతిపాదనలు? * అరగంటలో ముగిసిన మంత్రుల బృందం భేటీ * కేబినెట్ నోట్ సిద్ధం.. సవరణల భారం మంత్రిమండలికే * సాంకేతిక అంశాలపైనే దృష్టిపెట్టిన జీవోఎం * బిల్లు అమలులో సమస్యలు వచ్చే అంశాలపైనే చర్చ * రేపు భేటీ కానున్న కేబినెట్.. నేటి నుంచి పార్లమెంటు * 10న రాజ్యసభలో బిల్లు.. లోక్‌సభలో 11న? * బీజేపీ వైఖరిని బట్టబయలుచేసే వ్యూహంలో భాగంగానే ముందుగా రాజ్యసభలో విభజన బిల్లు * ఆ పార్టీ వైఖరి తేలిన తర్వాత లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై స్పష్టత వచ్చే అవకాశం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణలు ఉంటాయా? రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులు చేసిన సూచనల్లో వేటిని చేరుస్తారు? బిల్లులో ఉన్న వాటిలో వేటిని తొలగిస్తారు? రాష్ట్రం యావత్తూ ఎదురుచూసిన ఈ అంశంపై ఎటూ తేల్చకుండానే కేంద్ర మంత్రుల కమిటీ (జీవోఎం) మమ అనిపించింది. కొత్త రాజధాని ఏర్పాటుకు ఆర్థిక ప్యాకేజీపై ప్రతిపాదనలను మాత్రమే చేస్తూ.. సాంకేతిక సవరణలతో బిల్లును యథాతథంగా ఖరారు చేస్తూ కేబినెట్ నోట్‌కు ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర మంత్రిమండలికి పంపనుంది. కొత్త నిర్ణయాలు తీసుకొనే భారాన్ని కేంద్ర కేబినెట్‌కే వదిలేసింది. తెలంగాణ బిల్లుపై కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన జీవోఎం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్త్‌బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు షిండే, ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్, జైరాం రమేశ్లతోపాటు హోంశాఖ సహాయ మంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో బిల్లు ఆమోదానికి, అమలుకు తలెత్తే న్యాయపరమైన సమస్యలు, సాంకేతిక అంశాలపైనే దృష్టి పెట్టినట్టు తెలిసింది. బిల్లుతో పాటు ఉండాల్సిన ఫైనాన్షియల్ మెమోరాండం, ఇతర అంశాలపై చర్చించింది. రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులు ప్రతిపాదించిన 9,072 సవరణలను పట్టించుకోలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రధాన డిమాండ్లయిన పోలవరం ముంపు బాధిత ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం, కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ ఇవ్వడం వంటి అంశాలపై చర్చ జరిగినా.., వీటిపై నిర్ణయం తీసుకొనే భారాన్ని కేంద్ర మంత్రివర్గానికి వదిలేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పోలవరం ముంపు బాధిత ప్రాంతాలను సీమాంధ్రలో కలపడంవల్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు ఉండవన్న వాదన మినహా ఇతరత్రా ప్రయోజనం ఉండదని, అందువల్ల దీనిపై మార్పులు తగవని అభిప్రాయపడినట్లు తెలిసింది. కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక ప్యాకేజీపై మాత్రమే బిల్లులో అదనంగా చేరే అవకాశం కనిపిస్తోంది. ప్యాకేజీ ఎంత అనేది కూడా కేబినెట్ నిర్ణయానికే వదిలేసినట్టు సమాచారం. ఇప్పుడు ఏ సవరణలు చేసినా డిమాండ్లకు అంతం ఉండదని, పార్లమెంటులో వచ్చే సవరణలకే బిల్లులో స్థానం కల్పించాలని జీవోఎం భావిస్తున్నట్టు తెలిసింది. చివరకు బిల్లులో సాంకేతిక అంశాలు మినహాయించి ఎలాంటి మార్పులు లేకుండానే ముగిస్తూ కేబినెట్ నోట్‌ను ఆమోదించినట్టు సమాచారం. అరగంటలోనే సమావేశం ముగియగా, జైరాం రమేశ్ తప్ప మిగతా మంత్రులందరూ వెళ్లిపోయారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రి ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ బిల్లు సిద్ధమైందని తెలిపారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనిని మంత్రిమండలి ఆమోదిస్తుందని, తర్వాత పార్లమెంటుకు వెళుతుందని చెప్పారు. జీవోఎం భేటీ సందర్భంగా కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి జీవోఎం సభ్యులను కలిశారు. వీరు బిల్లుకు పలు సవరణలు సూచించినట్టు సమాచారం. కేబినెట్ భేటీ రేపు.. 10న రాజ్యసభలో బిల్లు బిల్లుపై జీవోఎం రూపొందించిన కేబినెట్ నోట్‌కు తుది రూపం ఇచ్చి, ఆమోదించడానికి కేంద్ర మంత్రి మండలి గురువారం సమావేశం కానుంది. అక్కడి నుంచి బిల్లు రాష్ట్రపతి ద్వారా పార్లమెంటుకు చేరుతుంది. మరోవైపు బుధవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బిల్లును ఈనెల 10న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు. అలాగే లోక్‌సభలో ఈనెల 11న బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముందుగానే రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ తన వైఖరిని వెల్లడించాల్సిన పరిస్థితిని కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. బీజేపీ వైఖరిని అనుసరించి మరునాడే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టాలా లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలా అన్నది నిర్ణయించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నెల 12న రైల్వేబడ్జెట్, 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నందున, సభ సజావుగా సాగేందుకు సొంత పార్టీ నేతలు సహకరించేలా ఒప్పించేందుకు కాంగ్రెస్ వార్‌రూంలో అధిష్టానం చర్చలు జరిపింది. మరోవైపు పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కమల్‌నాథ్ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఇరుప్రాంతాల ఎంపీలతో సమావేశం కానున్నారు. మూజువాణి ఓటుతో ఆమోదించాలి: కేసీఆర్ రాష్ట్ర విభజన బిల్లును ఓటింగ్ లేకుండా మూజువాణి ఓటుతోనే ఆమోదించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అఖిలపక్ష సమావేశంలో కోరారు. ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మం త్రులు, వివిధ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను ఇదే తరహాలో ఆమోదించారు. ఇప్పుడు కూడా అలాగే జరగాలి’’ అని చెప్పారు. ఇందుకు సంబంధించిన పత్రికల క్లిప్పింగులను మంత్రి కమల్‌నాథ్‌కు అందజేశారు. టీ బిల్లును తెస్తున్నాం: ప్రధాని ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నానని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కీలకమైన తెలంగాణ బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తున్నాం. సుదీర్ఘ చర్చ జరిగిన తరువాత తెలంగాణ బిల్లు లోక్‌సభకు వస్తోంది. సభ సజావుగా జరిగి బిల్లు పాస్ అవుతుందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా. అవినీతి నిరోధం, మహిళా రిజర్వేషన్ బిల్లు, మత హింస బిల్లు వంటి ముఖ్యమైన చాలా అంశాలు పెండింగులో ఉన్నాయి. ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ, ఈ అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది, సభ సజావుగా జరిగేందుకు సహకరించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతి సభ్యుడి విధి. సభ్యుడు లేవనెత్తే ఏ అంశం పైనయినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ప్రధాని చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందుతుందన్న విశ్వాసముందని ప్రధాని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
అసెంబ్లీలో హైడ్రామా
టీ బిల్లును అడ్డుకునేందుకు కుట్రలు సీఎం తీరు రాజ్యాంగ విరుద్ధం సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర బిల్లుపై శాసనసభలో హైడ్రామా నడుస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఐబీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లుకు సీల్డ్ కవర్ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. 40 రోజులకు పైగా చర్చ జరిగిన తరువాత ఇప్పుడు బిల్లును తిప్పి పంపాలని సీఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమేనని అన్నారు. బిల్లును తిరస్కరించాలని సీఎం స్పీకర్‌కు లేఖ ఇవ్వడం తన హద్దు మీరి ప్రవర్తించడమేనన్నారు. పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనైనా మనసున్నది మాత్రం ఆంధ్రాపైనేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, సాంకేతిక అంశాల పేరుతో వ్యతిరేకించడం సరైన చర్య కాదన్నారు. దేశమంతా ఎన్నికల వాతావరణం నెలకొంటే ఇక్కడ మాత్రం గందరగోళ పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితిని తొలగించి. పార్లమెంటులో బిల్లును ఆమోదించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు పెరిగిపోయాయని, నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. సెక్యులరిజం ప్రధాన పాత్ర పోషించాలని, దీనికి వామపక్షాలు ఒక వేదిక మీదికి వచ్చి మూడో ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ప్రకాశ్‌రావు, నర్సాపూర్ ఇన్చార్జి చినుముల కిషన్‌రెడ్డి, జిల్లా నాయకులు తాజుద్దిన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మందపవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీ బిల్లు ఓడిస్తాం... సమైక్యాంధ్ర సాధిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘‘అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లుపై చర్చకు అదనపు గడువు అడిగాం. బిల్లును ఓడిస్తాం. అలాగే క్లాజుల వారీగా చర్చించి ఓటింగ్ జరుపుతాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అన్ని క్లాజులపై ఓటింగ్ పెట్టి ఓడిస్తాం. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదు’’ అని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉద్ఘాటించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా సాగింది. ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అధ్యక్షోపన్యాసం చేస్తూ... తొలిసారిగా ప్రజాప్రతినిధులను సభకు ఆహ్వానించామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ అహంకారంతో రూపొందించిన విభజన బిల్లును అసెంబ్లీ, పార్లమెంట్ల్లో ఓడించి కనువిప్పు కలిగించాలని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. ఇందుకు జెండాలు, ఎజెండాలు పక్కకు పెట్టి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ...అవిశ్వాసం ప్రతిపాదన తీసుకొచ్చి సత్తా చూపాం. అది కేవలం ట్రైలర్ మాత్రమే, బిల్లు పార్లమెంటుకు వచ్చిన తరువాత అసలు సినిమా ఉంటుంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే సమైక్యవాది. టి.బిల్లుపై ఓటింగ్‌కు ఎవరైనా మొహం చాటేస్తే ‘కెవ్వు కేకే.. అంటూ హెచ్చరించారు. ‘పార్లమెంటులో మేము ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే ప్రభుత్వమే ఉండదు. అయినా అసెంబ్లీలో బిల్లును ఓడించడం ద్వారా తెలంగాణను అడ్డుకుంటాం’అని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ..పార్లమెంటుకు బిల్లు వస్తే ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు అని అన్నారు. మంత్రులు టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, వట్టి వసంతకుమార్, కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఓడించి తిరిగి పంపే బృహత్తర బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉందని చెప్పారు. 1972లో ఇందిరాగాంధీ దేశాన్ని ముక్కలు చేయవద్దని అన్ని ప్రాంతాలు కలిసి సాగాలని చెప్పగా, ఇప్పుడు సోనియాగాంధీ విభ జిస్తానంటున్నారని టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప విమర్శించారు. ధర్నాలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వి.శ్రీనివాస్, ఉగ్ర నరసింహారెడ్డి, నాగేశ్వర్రావు, దేవినేని ఉమా, దాసరి బాలవర్ధన్ రావు, శివరామరాజు, శ్రీరాం తాతయ్య, గాదె వెంకటరెడ్డి, పయ్యావుల కేశవ్, ఎమ్మె ల్సీ నన్నపనేని రాజకుమారి, బీఏసీ చైర్మన్ కేఈ కృష్ణమూర్తి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతిలు ప్రసంగించగా, వెంకటరామయ్య, రమేష్, ధర్మాన ప్రసాదరావు, చిక్కాల రామచంద్రరావు, లింగారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. లగడపాటిపై దాడి ధర్నా సందర్భంగా ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌పై తెలంగాణవాదులు దాడి చేశారు. వేదికపై ప్రసంగం ముగించి వెళ్లిపోయేందుకు సన్నద్ధం అవుతుండగా తెలంగాణ యువసేన (టీవైఎస్) కార్యకర్తలు లగడపాటి కాళ్లు పట్టుకొని లాగడంతో వేదిక పైనుంచి కిందికి పడిపోయారు. దాడిచేసిన వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించగా వారికి ముసు గులు వేసి తీసుకెళ్లారు. టీవైఎస్ కార్యకర్తలు ముగ్గురు, ఒక కానిస్టేబుల్, మరో వ్యక్తి జై తెలంగాణ నినాదాలు చేశారు. మరోవైపు ఉద్యోగులు ఏర్పాటుచేసిన సభ ఆద్యంతం కాంగ్రెస్, టీడీపీల ఉమ్మడి సభలా సాగిం ది. సభకు అధ్యక్షత వహించిన అశోక్‌బాబు.. కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులనే వేదికపైకి ఆహ్వానించి ప్రసంగించేలా చేశారు. -
పార్టీ నిర్ణయం తీసుకున్నా, నేను వ్యతిరేకిస్తున్నా:సిఎం
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నా తాను వ్యతిరేకిస్తున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. శాసనసభలో ఈ సాయంత్రం ఆయన ప్రసంగించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలుగు జాతికి మేలు జరుగుతుందన్నారు. పుట్టినప్పటి నుంచి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్, సోనియా గాంధీ వల్లే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. అయినా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల మేలు కోసమే విశాలాంధ్ర ఏర్పడిందని చెప్పారు. పార్లమెంట్లో ఇందిరా గాంధీ ప్రసంగాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మన రాష్ట్రం గురించి ఇందిర స్పష్టంగా మాట్లాడారని చెప్పారు. ముల్కీ,14 ఎఫ్లను బలవంతంగా తొలగించారన్నారు. ఏ ప్రాంతంలో ఉన్నా తెలుగు వారందరూ కలిసి ఉండాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. వెనుకబాటు తనాన్ని చూపి విభజన ఇందిరా గాంధీ వద్దన్నారని చెప్పారు. నాటి ఇందిర ప్రసంగం ఇప్పుడు ఎంతో అవసరం అన్నారు. విభజన ఏ మాత్రం పరిష్కారం కాదని ఆమె చెప్పినట్లు తెలిపారు. రేపు ఒక్కో జిల్లా ఒక్కో రాష్ట్రంగా మార్చుతామంటే ఏలా? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అనేది వేల ఏళ్లుగా ఉన్న ఒక రాష్ట్రం - బుద్ధుడి కాలం నుంచి తెలుగువాళ్లు కలసి ఉన్న రాష్ట్రం - కొంతకాలం మినహా తెలుగువారందరూ కలిసే ఉన్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ కలిసే ఉండాలని ఇందిర కోరుకున్నట్లు తెలిపారు. విభజనతో పరిష్కారం అభిస్తుందని అనుకుంటే పొరపాటని ఆమె చెప్పిన విషయం గుర్తు చేశారు. పార్లమెంట్ జాతి సమగ్రతకు అద్దం పట్టాలని ఇందిర అన్నారని తెలిపారు. తొందరపాటుతో నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. దేశాన్ని ముక్కలు చేయడం సరికాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు జాతి సమగ్రతలో ఒక భాగం. తెలుగు వారు ఎప్పుడూ, రాష్ట్రానికి, దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించరు. మొదటి ఆర్టికల్‌లో మన దేశం సమాఖ్య అని పేర్కొంది. రాజధాని రెండు ప్రాంతాల్లో ఉందని గుర్తించాలని ఇందిర చెప్పినట్లు సిఎం తెలిపారు. -
గడువు పొడిగింపుపై రాత్రికి లేక రేపు నిర్ణయం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చకు గడువు పొడించే విషయంపై ఈ రాత్రికి గాని లేక రేపు ఉదయం గానీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయమై ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఫోన్లో మాట్లాడారు. గడువు పెంపు విషయమై ఆరా తీశారు. ఈ రాత్రికి గాని రేపు గాని నిర్ణయం వెలువడే అవకాశం ఉందని మహంతి ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. చర్చకు మరో నెల రోజులు గడువు పొడగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతి కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. ఆ లేఖను హొం శాఖ రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి న్యాయసలహా కోరినట్లు హోంశాఖ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ కార్యదర్శి శివశంకర్ గడువు పెంపుపై కేంద్ర హోంశాఖ అధికారులను కలిశారు. -
'తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తారు'
ఢిల్లీ: తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. శాసనసభలో 150 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తారని గట్టినమ్మకంతో చెప్పారు. ఆ తీర్మానంతో జాతీయ పార్టీ నేతలను కలుస్తామని చెప్పారు. న్యాయస్థానానికి వెళ్లే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అశోక్‌బాబు తెలిపారు. -
తెలంగాణ బిల్లుకు ప్రతిపాదించిన 9 సవరణలు ఇవే!
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా (తెలంగాణ బిల్లు) బిల్లులో సవరణలను ప్రతిపాదిస్తూ తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పత్రాలు అందజేశారు. వారు అందజేసిన పత్రాలలో 9 సవరణలు పేర్కొన్నారు. 1. ఉద్యోగుల స్థానికత ఆధారంగానే పెన్షన్ అప్పులను పంపిణీ చేయాలి. 2. ఉమ్మడి రాజధానిపై పార్లమెంట్లో సరైన ప్రొవిజన్ ఏర్పాటు చేయాలి. 3. తెలంగాణ మంత్రుల సలహాలు సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలి. 4. తెలంగాణకు హైకోర్టు ఉండాలి. 5. కొత్తగా ఏర్పాటు కానున్న రాష్ట్రాలు తమకు అనుకూలంగా కొత్త ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలి. 6. స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీ చేసుకునేందుకు ఇరురాష్ట్రాలకు వీలు కల్పించాలి. 7.విద్యుత్ పంపిణీ ఒప్పందాలు, కొత్త ప్లాంట్లను రెండు రాష్ట్రాల అవసరాలమేరకు కేటాయించే విధంగా సహేతుకంగా సంబంధిత నిబంధనలు సవరించాలి. 8. తెలంగాణలో ఎయిమ్స్, వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలి. విద్యా సంస్థల్లో కామన్ అడ్మిషన్ మరో 5 ఏళ్లపాటు కాకుండా ఇంకా తగ్గించాలి. 9. ఎన్టీపీసీ 4వేల మెగావాట్ల ప్రతిపాదిత పవర్ ప్రాజెక్టును తెలంగాణకే కేటాయించాలి.