హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా (తెలంగాణ బిల్లు) బిల్లులో సవరణలను ప్రతిపాదిస్తూ తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు పత్రాలు అందజేశారు. వారు అందజేసిన పత్రాలలో 9 సవరణలు పేర్కొన్నారు.
1. ఉద్యోగుల స్థానికత ఆధారంగానే పెన్షన్ అప్పులను పంపిణీ చేయాలి.
2. ఉమ్మడి రాజధానిపై పార్లమెంట్‌లో సరైన ప్రొవిజన్ ఏర్పాటు చేయాలి.
3. తెలంగాణ మంత్రుల సలహాలు సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలి.
4. తెలంగాణకు హైకోర్టు ఉండాలి.
5. కొత్తగా ఏర్పాటు కానున్న రాష్ట్రాలు తమకు అనుకూలంగా కొత్త ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలి.
6. స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీ చేసుకునేందుకు ఇరురాష్ట్రాలకు వీలు కల్పించాలి.
7.విద్యుత్ పంపిణీ ఒప్పందాలు, కొత్త ప్లాంట్లను రెండు రాష్ట్రాల అవసరాలమేరకు కేటాయించే విధంగా సహేతుకంగా సంబంధిత నిబంధనలు సవరించాలి.
8. తెలంగాణలో ఎయిమ్స్, వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలి. విద్యా సంస్థల్లో కామన్ అడ్మిషన్ మరో 5 ఏళ్లపాటు కాకుండా ఇంకా తగ్గించాలి.
9. ఎన్‌టీపీసీ 4వేల మెగావాట్ల ప్రతిపాదిత పవర్ ప్రాజెక్టును తెలంగాణకే కేటాయించాలి.
తెలంగాణ బిల్లుకు ప్రతిపాదించిన 9 సవరణలు ఇవే!
Published Thu, Jan 9 2014 9:03 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement