సీఎం ధర్నా చేసినా చర్యలుండవా?: బీజేపీ
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, ఈ అంశాన్ని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ దుయ్యబట్టింది. తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉంటే సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ నేతలపై బహిష్కరణ వేటు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించింది.
ఈ మేరకు బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ కాంగ్రెస్‌పై శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ‘వారి(కాంగ్రెస్) ముఖ్యమంత్రే ధర్నాకు దిగారు. వారి సొంత ఎంపీలే సభలకు అడ్డుతగులుతున్నారు. వారి ఎంపీలే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతారు. అలాంటప్పుడు వారిని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరు?’ అని ప్రశ్నించారు.