
సాక్షి, న్యూఢిల్లీ: దేశ యువతలో, ఐటీ నిపుణుల్లో నిబిడీ కృతమై ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించేం దుకు అవసరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని, తద్వారా ‘ఆత్మనిర్భర భారత్’లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభాప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో స్వదేశీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎలిమెంట్స్’యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం ఇతరులను అనుకరించడాన్ని పక్కనపెట్టి కొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు.