
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన
న్యూఢిల్లీ: సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఈ ఉదయం కేంద్ర మంత్రి, జిఓఎం సభ్యుడు జైరామ్ రమేష్ను కలిశారు. వారి మధ్య చర్చ ప్రధానంగా హైదరాబాద్ పైనే జరిగింది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేయాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు కోరారు. అలా కాని పక్షంలో పరిమిత ఆంక్షలతో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని ప్రతిపాదించారు.
జైరామ్ రమేష్ను కలిసినవారిలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు పల్లంరాజు, పనబాక లక్ష్మి, చిరంజీవి, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, జెడి శీలం ఉన్నారు. కావూరి సాంబశివరాలు విదేశీ పర్యటనలో ఉన్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, విద్యా, ఉద్యోగ అంశాలు కేంద్ర పరిధిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జిఓఎం ఈ విధమైన ప్రతిపాదన చేస్తుందని భావిస్తున్నారు.