హైదరాబాద్ విషయమై కేంద్ర మంత్రి, జిఓఎం సభ్యుడైన జైరామ్ రమేష్ను కలిసిన సీమాంధ్ర కేంద్రమంత్రులకు ఆయన యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీని కలవమని సలహా ఇచ్చారు.
ఢిల్లీ: హైదరాబాద్ విషయమై కేంద్ర మంత్రి, జిఓఎం సభ్యుడైన జైరామ్ రమేష్ను కలిసిన సీమాంధ్ర కేంద్రమంత్రులకు ఆయన యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీని కలవమని సలహా ఇచ్చారు. జైరాం రమేష్తో సీమాంధ్ర కేంద్రమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కావూరి సాంబిశివరాలు, కోట్ల విజయభాస్కర రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.
సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని వారు కోరారు. ఇరుప్రాంతాలకు ప్రయోజనం కలిగే విధంగా, సమన్యాయం జరిగే విధంగా చేయాలన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని చేసినందున ఒరిగేదేమీలేదని చెప్పారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం (యుటి) చేయాలని కోరారు. వారు చెప్పిన మాటలు విన్న తరువాత సోనియా గాంధీని కలమని జైరాం రమేష్ వారికి సూచించారు.