
'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు'
హైదరాబాద్: విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ నరసింహాన్కు అప్పగించాలని ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానించారు.
ఈ అధికారం తక్షణమే అప్పగించాలని కేంద్రాన్ని కోరాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు.