జనవరిలోగా తెలంగాణ: రాజనరసింహ | hyderabad joint capital 5 years only damodara rajanarasinha | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 12 2013 7:22 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 5 ఏళ్లు ఉంటే చాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. తెలంగాణ విభజనకు ఏర్పాటు చేసి కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం)తో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. రాజనరసింహ కేవలం పది నిమిషాలు మాత్రమే వారితో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనవరిలోగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే అన్నారు. 10 జిల్లాలతో కూడి తెలంగాణ కావాలన్నారు. తెలంగాణ రెవెన్యూ తమ సొంతం అని చెప్పారు. ఆంధ్ర ప్రాంతానికి అవసరమైన ప్యాకేజీలు ఇవ్వాలని జిఓఎంను కోరినట్లు తెలిపారు. ఉద్యోగుల విషయంలో 371డి కొనసాగించాలని చెప్పారు. గోదావరి నదిపైన రెగ్యులేటరీ అథారిటీ అవసరంలేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement