సీమాంధ్ర కొత్త రాజధానికి ఒకట్రెండేళ్లు చాలు: ఈటెల రాజేందర్ | two years to be enough to form seemandhra new capital, says Etela rajender | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర కొత్త రాజధానికి ఒకట్రెండేళ్లు చాలు: ఈటెల రాజేందర్

Published Wed, Oct 23 2013 1:22 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

సీమాంధ్ర కొత్త రాజధానికి ఒకట్రెండేళ్లు చాలు: ఈటెల రాజేందర్ - Sakshi

సీమాంధ్ర కొత్త రాజధానికి ఒకట్రెండేళ్లు చాలు: ఈటెల రాజేందర్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తరువాత కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో కొత్త రాజధాని నిర్మాణానికి ఒకట్రెండేళ్లకు మించి వ్యవధి అక్కర్లేదని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగింపును మూడేళ్లకే పరిమితం చేయాలన్న తెలంగాణ జేఏసీ డిమాండ్‌పై ఈటెల ఈ విధంగా స్పందించారు. ఆయున వుంగళవారం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, టీఆర్‌ఎస్ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు బాల్క సుమన్‌లతో కలసి తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను పదేళ్లదాకా, ఉమ్మడి రాజధానిగా ఉంచే విషయంపై తాము మొన్నటి వరకు ఆలోచించామని అరుుతే, సీవూంధ్రలో పెద్దపెద్ద కాంట్రాక్టర్లే ఉన్న కారణంగా రాజధాని నిర్మాణానికి అంత గడువు అక్కర్లేదని అనుకుంటున్నావుని రాజేందర్ చెప్పారు. విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎంకు) తెలంగాణ జేఏసీ నివేదిక ఇచ్చినా పార్టీతరఫున తామూ నివేదిక ఇస్తావున్నారు. అరుుతే, పార్టీ నివేదికలో ఏ అంశాలుంటాయో చె ప్పడానికి ఆయన నిరాకరించారు.
 
 ఏ త్యాగం చేశారని జైత్రయాత్రలు?: ప్రత్యేకరాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్  నాయకులు ఏ త్యాగం చేశారని ఇప్పుడు జైత్రయాత్రలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహంతో ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటావుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలువరించే సత్తా లేకపోతే, తెలంగాణ మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ కుర్చీని కాపాడుతున్నది మీరే కాదా? అని తెలంగాణ వుంత్రులను ప్రశ్నించారు. తెలంగాణ మంత్రుల బలం లేకుండా ఆయన ఆపదవిలో కొనసాగే అస్కారమే లేదన్నారు.
 
 సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇవ్వడంపై తమకు అభ్యంతరం లేకపోయినా, 56 ఏళ్ల సమైక్య పాలనతో ఎన్నోవిధాల నష్టపోయిన తెలంగాణకు తగిన న్యాయం చేయాలన్నారు. తెలంగాణ అంశాన్ని జాప్యంలేకుండా తేల్చాలన్న జయప్రకాశ్ నారాయణ్ ఇపుడు వూట వూర్చారని, విభజనపై నిర్ణయమే తప్పుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. విభజనపై సుప్రీంలో కేసు వేస్తానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అంటున్నారని, పార్లమెంట్ విశేషాధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదన్న విషయం వారికి తెలియదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 56 ఏళ్ల పాటు తెలంగాణకు  ఏమి సమన్యాయం జరిగిందని, సీమాంధ్ర నేతలు సమన్యాయం అడుగుతున్నారని సోవూరపు సత్యనారాయణ ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు జై త్రయాత్రలు  మాని వచ్చిన తెలంగాణను ఎలా రక్షించుకోవాలన్న దానిపై దృష్టి పెడితే మంచిదని సలహా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement