మీటర్లు ఏర్పాటయ్యే వరకు జనాభా ప్రాతిపదికన బిల్లుల చెల్లింపు
తెలంగాణకు ఒరిజినల్ బిల్లు, ఆంధ్రాకు జిరాక్స్
హైదరాబాద్: ఉమ్మడి రాజధానిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సచివాలయూలతో పాటు పలు ఇతర శాఖల కార్యాలయాలు కూడా ఒకే ప్రాంగణం, ఒకే భవనంలో పనిచేస్తున్నాయి. అయి నా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ కార్యాలయూలు కావడంతో విద్యుత్, నీటి చార్జీలను ఎలా లెక్కించాలి, ఎవరు ఎంత చెల్లించాలనే సమస్య తలెత్తింది. పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలో ప్రకటించిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న విద్యుత్, నీటి మీటర్లను తెలంగాణకు వదిలేసి, ఆంధ్రప్రదేశ్‌కు విడిగా విద్యుత్, నీటి మీటర్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విద్యుత్ , నీటి మీటర్లకు ఆయా శాఖలు, విభాగాలు దరఖాస్తు చేిసినా ఇంకా మీటర్ల ఏర్పాటు కాలేదు. ఎవరి మీటర్లు వారికి ఏర్పాటయ్యేందుకు రెండు నెలలు పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అప్పటి వరకు విద్యుత్, నీటి చార్జీలను ఎవరు, ఎంత చెల్లించాలనే అంశంపై ఏపీ ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మీటర్ల ఏర్పాటునకు రెండు నెలలు సమయం ఇస్తూనే అప్పటివరకు విద్యుత్, నీటి చార్జీలను జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 58 శాతం, తెలంగాణ సర్కారు 42 శాతం చొప్పున చెల్లించాలనే నిబంధనను విధించాలని ప్రతిపాదిస్తోంది. ఒరిజినల్ బిల్లుతో తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే, జిరాక్స్ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చార్జీలు చెల్లిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంటోంది. ఇందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆయా శాఖల కార్యదర్శులు అంగీకరించడంతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన అపెక్స్ కమిటీ ఆమోదం కూడా అవసరం అవుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
పాత బకాయిలు రూ. 200 కోట్లు
ఉమ్మడి రాష్ట్రానికి చెందిన విద్యుత్, నీటి చార్జీల బిల్లులన్నింటినీ రాష్ట్ర విభజన తేదీకి ముందే చెల్లించేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. అరుుతే రాష్ట్రం విడిపోక ముందు పాస్ అరుు్య చెల్లింపులు జరగని బిల్లులను రాష్ట్రం విడిపోయాక తొలుత తెలంగాణ పీఏఓ చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆ బిల్లుల మొత్తాన్ని జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రానికి ఎంత అనేది అకౌంటెంట్ జనరల్ సర్దుబాటు చేయాలని సూచించారు. ఈ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో బిల్లులు పాస్ అరుు్య చెల్లింపులు జరగకుండా (మే నెలలో) రాష్ట్రం విడిపోయిన తరువాత చెల్లించాల్సిన విద్యుత్, నీటి చార్జీలు రూ.200 కోట్ల మేరకు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ లెక్కతేల్చింది. ఆ లెక్క ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రం ఎన్ని నిధులు చెల్లించాలో స్పష్టం చేయాల్సిందిగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి అకౌంటెంట్ జనరల్‌కు లేఖ రాశారు. ఇలావుండగా ఇంకా ఎవరైనా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్, నీటి చార్జీల బిల్లులను సమర్పించకపోతే అవి ఏ రాష్ట్రం చెల్లించాలనేది చెప్పడం కష్టమేనని, ఆ బిల్లులతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం ఉండదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయమై రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీ తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఎవరి మీటర్లు వారివే!
Published Mon, Jun 30 2014 1:42 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement
Advertisement