
అధిష్టానం పెద్దలతో గవర్నర్ వరుస భేటీలు
న్యూఢిల్లీ : హస్తినలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరంతో భేటి అయిన ఆయన సుమారు ఆరగంట పాటు రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం టెన్ జన్‌పథ్ లో సోనియాగాంధీతో ....నరసింహన్ 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు . అటు తరువాత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని యంత్రాంగంపై చర్చించినట్లు తెలుస్తోంది.