ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్ | Devi prasad elected as mlc candidate for trs | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్

Published Sat, Feb 21 2015 3:24 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్ - Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్

హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా టీఎన్జీవో నాయకుడు దేవీ ప్రసాద్ పేరు ఖరారైంది. మరోవైపు వరంగల్, నల్లగొండ, ఖమ్మం నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లె రాజేశ్వరరెడ్డి పేరును టీఆర్ఎస్ అధినాయకులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం అధికారికంగా పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది.

కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్జీవో నేత దేవీప్రసాద్ ముందుగానే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవీప్రసాద్ మెదక్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కాగా దేవీప్రసాద్ రాజీనామాను అధికారులు ఇంకా ఆమోదించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement