
దేవీ ప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికలలలో తన ఓటమి ప్రభుత్వంపై వ్యతిరేకత కాదని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో పట్టుభద్రుల స్థానానికి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన దేవీ ప్రసాద్ అన్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు దాదాపు పదివేల ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే.
ఫలితాలు వెలువడిన అనంతరం దేవీ ప్రసాద్ మాట్లాడుతూ తన ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికలలో దాదాపు పది వేల ఓట్లు చెల్లలేదని చెప్పారు. తనకు ఓటు వేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు.బీజేపీ గెలిచినప్పటికీ అధికార టీఆర్ఎస్కు వ్యతిరేక తీర్పుగా భావించలేం అని ఆయన అన్నారు.