నా సెల్ఫీ.. ఓ సందేశం | Idi Naa Selfie Movie Audio Launch | Sakshi
Sakshi News home page

నా సెల్ఫీ.. ఓ సందేశం

Published Fri, Oct 12 2018 1:48 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Idi Naa Selfie Movie Audio Launch - Sakshi

ఆరోహి, వినోద్‌

శ్రీ చరణ్‌ సెన్సేషనల్‌ మూవీస్‌పై చిరుగురి చెంచయ్య, సుగుణమ్మ సమర్పిస్తున్న చిత్రం ‘ఇది నా సెల్ఫీ’. సి.హెచ్‌ ప్రభాకర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నువ్వుల వినోద్, ఆరోహి నాయకా నాయికలుగా నటిస్తున్నారు. సతీశ్‌రాయ్‌ కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్‌ మాలపాటి స్వరాలు అందించారు. ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లో గురువారం విడుదల చేశారు.

ఈ వేడుకలో దర్శకులు యన్‌.శంకర్, దేవీ ప్రసాద్, నిర్మాత సాయివెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. సీహెచ్‌  ప్రభాకర్‌ మాట్లాడుతూ– ‘‘ఇది నా సెల్ఫీ’ అనగానే అందమైన సెల్ఫీల గురించి అనుకుంటారు. సెల్ఫీల వల్ల జరిగే అనర్థాలను, జ్ఞాపకాల నేపథ్యంలో తీసిన చిత్రమిది. ఈ చిత్రం సమాజానికి మంచి మెసేజ్‌ ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. దర్శకుడు యన్‌.శంకర్‌ మాట్లాడుతూ– ‘‘నటీనటులందరూ బాగా నటించారు. పాటలన్నీ బాగున్నాయి. అన్ని ఎమోషన్స్‌తో కూడిన పాటలు ఉన్నాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement