ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమని తేలినా, సీమాంధ్రులు అడ్డుపడుతున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమని తేలినా, సీమాంధ్రులు అడ్డుపడుతున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో అంతా కలిసి ఉందామని ఆయన సూచించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సీమంధ్రాలో ఉద్యమం ఎగసి పడుతున్న తరుణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రాంత ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు
ప్రాంతాల వారీగా విడిపోయి, అన్న దమ్ముల వలే కలిసుందామన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఎటువంటి ఉద్రేకాలకు వెళ్లకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15న హైదరాబాద్ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.