సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన సమ్మె అదర్మమని టీఎన్‌జీవో చైర్మన్ దేవీప్రసాద్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన సమ్మె అదర్మమని టీఎన్‌జీవో చైర్మన్ దేవీప్రసాద్ అభిప్రాయపడ్డారు. సీమాంధ్రులు సమ్మెను ఉధృతం చేస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రులు చేపట్టిన సమ్మె అధర్మమంగా, అనైతికంగా ఆయన అభివర్ణించారు. గతంలోతెలంగాణ ఉద్యోగులు చేపట్టిన సమ్మె చేసినపుడు ఎస్మా ప్రయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేపటి సమ్మెలో పాల్గొన్న వారంతా ఆంధ్రా ఉద్యోగులేనని ఆయన అన్నారు. అలాంటి వారికి తెలంగాణలో ఉండే స్థానం లేదని తెలిపారు. ఆంధ్రా ఉద్యోగులు సమ్మె చేసినా తాము ప్రభుత్వానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.