నాంపల్లి: ఏపీకి చెందిన హెచ్‌ఓడీలను విజయవాడకు తరలించడాన్ని టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ , అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి స్వాగతించారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు విలేకరులతో మాట్లాడారు.
తరలింపు వల్ల ఆర్డర్ టు సర్వ్ కింద పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు తీసుకుని పోతామంటే అడ్డుకుంటామని అన్నారు. చంద్రబాబుకు, అశోక్‌బాబుకు ఉద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఆంధ్రా ఉద్యోగులను ఆంధ్రాకు, తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. మే 28న టీఎన్జీఓ కేంద్ర వర్గ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలియజేశారు.
తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రకు వెళ్లనివ్వం
Published Tue, May 26 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM
Advertisement
Advertisement