
టీఎన్‌జీవోలు సిద్ధమే: దేవీప్రసాద్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తు కోసం టెట్, ఎంసెట్ పరీక్షల నిర్వహణకు స్వచ్ఛందంగా సహకరిస్తామని టీఎన్‌జీవో గౌరవ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వం పరీక్షల తేదీలను ప్రకటించి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ విధులను వేయాలని కోరారు.