హైదరాబాద్:తనకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కూడా మద్దతిస్తామని ప్రకటించినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ తెలిపారు. ఆంధ్రా ఉద్యోగులు తనను వ్యతిరేకిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు.
ఆంధ్రా ఉద్యోగులు తాను వ్యతిరేకం కాదని దేవీప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం తాను నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు దేవీప్రసాద్ తెలిపారు.