డిగ్రీ చేయని దేవీప్రసాద్.. ఎమ్మెల్సీనా?
డిగ్రీ కూడా పూర్తిచేయని దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ పదవికి ఎలా అంగీకరిస్తారని స్వతంత్ర అభ్యర్థి శ్రీశైలం ప్రశ్నించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలంటూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
అలాగే.. బ్యాలట్ పేపర్లో పార్టీల పేర్లను ఎలా ముద్రిస్తారని కూడా ఆయన తన పిటిషన్లో ప్రశ్నించారు. పార్టీల పేరు ముద్రించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు.