దేవీప్రసాద్‌కు కేసీఆర్ హామీ!
దేవీప్రసాద్‌కు కేసీఆర్ హామీ!
Published Tue, Aug 26 2014 6:05 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ సీటుపై ఆశలు పెంచుకున్న ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ కు చుక్కెదురైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో మెదక్ పార్లమెంట్ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. గత కొద్ది రోజులుగా మెదక్ సీటు టికెట్ రేసులో దేవీ ప్రసాద్ దూసుకుపోతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దేవీ ప్రసాద్ కు పోటీగా కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు తెరమీదకు రావడంతో టికెట్ కేటాయింపు అంశం ఆసక్తిగా మారింది.
కేసీఆర్ సింగపూర్, మలేషియా పర్యటనలో నేపథ్యంలో మెదక్ లోకసభ సీటు అభ్యర్థి ఎంపిక వాయిదా పడింది. పార్టీ కమిటీ పలు దఫాలుగా నిర్వహించిన చర్చల అనంతరం మెదక్ లోకసభ టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని ఖారారు చేశారు. దాంతో ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ నిరాశలో మునిగినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలో ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టడానికి ఎమ్మెల్యే కోటాలో దేవీ ప్రసాద్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ బుజ్జగించినట్టు సమాచారం.
Advertisement