దేవీప్రసాద్‌కు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి | TNGO Demand Medak MP Seat for Devi Prasad | Sakshi
Sakshi News home page

దేవీప్రసాద్‌కు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి

Published Mon, Aug 18 2014 2:47 PM | Last Updated on Mon, Oct 8 2018 7:43 PM

దేవీప్రసాద్‌కు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి - Sakshi

దేవీప్రసాద్‌కు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి

హైదరాబాద్: తెలంగాణ ఎన్జీవోల అత్యవసర సమావేశం ముగిసింది. మెదక్ ఎంపీ స్థానానికి టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ను పోటీ చేయించాలని సమావేశంలో తీర్మానం చేశారు. త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి దేవీప్రసాద్‌ కు టికెట్ ఇవ్వాలని టీఎన్‌జీవో సంఘం నేతలు కోరనున్నారు. సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక జరగనుంది. కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో మెదక్ స్థానం ఖాళీ అయింది.

కాగా, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement