దేవీ ప్రసాద్
‘‘నేను డైరెక్టర్ అయినా ఇతర దర్శకుల చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వారికి సలహాలు ఇవ్వను. మనం డైరెక్టర్ అయినా ఒక నటుడిగా నటిస్తున్నప్పుడు ఆ దర్శకుడి వద్దకు తెల్ల కాగితంలా వెళ్లాలి. అప్పుడే దానిపై తనకు నచ్చింది రాసుకుంటాడు’’ అని దేవీ ప్రసాద్ అన్నారు. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్య పాత్రల్లో విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన దేవీ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు.
► ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లాదకరమైన కథ. మనుషుల్లోని మంచీ చెడులు, వాటి వల్ల ఏర్పడే సమస్యల ఇతివృత్తంగా తెరకెక్కింది.
► సాధారణంగా కొత్త దర్శకుడు లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ లేదా యాక్షన్ చిత్రాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కానీ విశ్వనాథ్ దానికి భిన్నంగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నాడు.
► ఓ గ్రామంలోని పెద్దాయన కొడుకు పాత్ర నాది. కెరీర్ కోసం పట్నం వెళ్లి అక్కడే స్థిరపడిన వ్యక్తిలా కనిపిస్తాను. మనం, మన సంపాదన, భవిష్యత్తు అనే ఆలోచనా ధోరణి ఉంటుంది.
► రాజేంద్రప్రసాద్‌గారితో చేయాలనే నా కోరిక ‘తోలుబొమ్మలాట’ తో నెరవేరింది. ఆయనతో పాటు ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటులందరి నుంచి నాకు తెలియని చాలా విషయాలు ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను.
Comments
Please login to add a commentAdd a comment